
రేవంత్ పాలన మంచిగలేదు బిడ్డా!
బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుతో ఓ మహిళ ఆవేదన
పయనించే సూర్యుడు అక్టోబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
రేవంత్ రెడ్డి పాలన ఏం మంచిగలేదు. కేసీఆర్ పాలననే మంచిగుండే. మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మేలైతది బిడ్డా అంటూ వైరా నియోజకవర్గం ఏన్కూర్ మండలం నాచారం గ్రామానికి చెందిన 50 ఏండ్ల మహిళ బుధవారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుతో పేర్కొన్నది. ఈ సందర్భంగా మహిళా. లకావత్ గిరిబాబు వద్దకు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరూ సంతోషంగా లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఇంకోసారి కాంగ్రెస్కు ఓటు వెయ్యం. మళ్లీ కేసీఆరే రావాలి బిడ్డా అని తన మనసులో మాటను తెలిపింది