పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 26(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల వ్యాప్తంగా ఆదివారం76వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాడికి బస్టాండ్ సర్కిల్ లోని గాంధీ విగ్రహం వద్ద యాడికి సి.ఐ. ఈరన్న జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల త్యాగ నిరతిని ఆయన కొనియాడారు. స్థానిక పారడైస్ స్కూల్ విద్యార్థులు మరియు విజన్ స్కూల్ విద్యార్థులు కలిసి 200 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమం మైల్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.
మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం. సిఐ ఈరన్న.
RELATED ARTICLES