
డాక్టర్ కందుల దినేష్
పయనించేసూర్యుడు మార్చి 26 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు,)
టేకులపల్లి మండలం సులానగర్ పీహెచ్ సి వైద్య బృందం వైద్య శిబిరం మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర హాస్టల్లో వైద్య శిబిరం నిర్వహించి పిల్లలకు చికిత్స అందించడం జరిగింది అనంతరం పిల్లలకు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చే వ్యాధులు మరియు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారం పై క్షయ కుష్టు వంటి అంటూ వ్యాధులపై చర్మవ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది పరీక్షల సమయంలో ఒత్తిడి ఆందోళనలకు దూరంగా ప్రశాంతంగా ఉండాలని ఎక్కువ మంచినీరు తీసుకోవాలని ఎక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాలైన ప్రోటీన్లు కలిగిన గుడ్డు పప్పులు పెరుగు పాల ఉత్పత్తులు తీసుకోవాలని తగినంత నిద్ర పరీక్షలు విజయవంతంగా ముగించడానికి ఉపయోగపడతాయని అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యకరమని పిల్లలకు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీందర్ ఆరోగ్య విస్తరణ అధికారి దేవా స్టాఫ్ నర్స్ రేష్మ ఏఎన్ఎం సులోచన, చంద్రకళ మజహరి సుజాత ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు