
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
సంఘసంస్కర్త, సామాజికవేత్త, విద్యా ప్రదాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువులా చూసుకునే గొప్ప మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే.
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జే ఎ సి) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. 1827 ఏప్రిల్ 11 వ తారీకు జన్మించిన జ్యోతిరావు పూలే భారతదేశానికి తొలివెలు గై విద్యను అందించిన మహనీయుడు. చదువురాని మహిళను వివాహమాడిన తర్వాత సావిత్రిబాయి పూలేను ఒక విద్యావంతురాలుగా భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయునిగా తయారు చేయడం ఆయన తన ఇంటిని మొదటగా సంస్కరించారు. మనువాదుల కాలంలో మహిళ చదువుకోవడం ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవడం గొప్ప నేరముగా భావించి వారిని సమాజంలో చదువుకు దూరం చేశారు. సమాజ చైతన్యం కోసం నడుం బిగించిన జ్యోతిరావు పూలే ముందుకొచ్చి దళిత బడుగు బలహీన వర్గాలకు మహిళలకు చదువు నేర్పిన గొప్ప వ్యక్తి అని జేఏసీ నాయకులు కొనియాడారు.
గౌరవనీయులు షాద్నగర్ శాసనసభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వీర్లపల్లి శంకర్ కార్యక్రమానికి హాజరై తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఈనాడు ఈ దేశంలో ఈ మాత్రం దళిత బహుజన వర్గాల్లో చైతన్యం పొందడానికి కారకుడైన గొప్ప వ్యక్తిని అందరము ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను పూర్తి చేయాలని తెలిపారు. సంఘసంస్కర్త సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే గారికి ఎమ్మెల్యే శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలలో పాల్గొన్నవారు జేఏసీ నాయకులు చైర్మన్ ఎం జనార్ధన్, కన్వీనర్ బాలరాజు, వ్యవసాయ మార్కెట్, టిఎల్ఎఫ్ డైరెక్టర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కరుణాకర్, జేఏసీ జిల్లా కన్వీనర్ టి జి శ్రీనివాస్, రవీంద్రనాథ్ , వి రామారావు, సత్యనారాయణ గౌడ్,ఎం నరసింహులు, టెలిఫోన్ వెంకటయ్య, బాదేపల్లి సిద్ధార్థ, రాము గోర్ల, క్రాంతి కుమార్, క్యూసెట్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జేఏసీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహాత్మ జ్యోతిరావు పూలే కి భారతరత్న అవార్డు ప్రకటించాలని షాద్నగర్ తాలూకా జేఏసీ డిమాండ్ చేస్తున్నది.