
యువ నాయకుడు భాగాళ్ల నరసింహ
ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించిన బాగాళ్ల నర్సింహా
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించేలా చూడాలని గ్రామ యువ నాయకుడు బాగళ్ల నరసింహ్మ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కోరారు. మంగళవారం షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొందుర్గు మండలం మహాదేవ్ పూర్ గ్రామానికి చెందిన యువ నాయకుడు బాగళ్ల నరసింహ కలుసుకొని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడిలకు ప్రహరీ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించి ప్రహరీ గోడను నిర్మించేలా చూడాలని ఆయన ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఈ విడతలో ప్రహరీ గోడల నిర్మాణాలను కచ్చితంగా చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం యువ నాయకుడు నరసింహ మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నానని పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న పాఠశాలకు, అంగన్వాడికి ప్రహరీ గోడ లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారనే సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే స్పందించి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు.