
పయనించే సూర్యుడు ఏప్రిల్ 9( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలో విద్యార్థినులకు, మహిళలకు రక్షణ కవచంగా ఉండే శక్తి యాప్ పై అవగాహన కల్పిస్తున్న మహిళా పోలీసులు. సర్కిల్ పరిధిలోని కోటమ్మ , సునీత అనే మహిళ పోలీసులు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. పట్టణంలో అన్ని ప్రాంతాలలో తిరుగుతూ మహిళలకు వారి సెల్ ఫోన్లలో ఈ యాప్ ను డౌన్లోడ్ చేస్తూ ఈ యాప్ యొక్క అవగాహన దీని నుండి మహిళలు పొందవలసిన రక్షణ గురించి వివరించారు. మహిళలపై దాడులు, ఈవిటిజింగ్ వేధింపులతో కలిగే ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ యాప్ ఉపయోగించి పోలీసుల సహాయం పొందవచ్చుని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు