
మహిళలను రాజకీయంగా ప్రోత్సహించే లక్ష్యంతో బీసీ సేన మహిళా కమిటీ
( పయనించే సూర్యుడు మార్చి 04 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్)
నేడు షాద్ నగర్ నియోజకవర్గంలో బీసీ సేన మహిళా కమిటీ బీసీ సేన నియోజక వర్గ అధ్యక్షులు చంద్ర శేఖరప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది నియోజక వర్గ అధ్యక్షులుగా బాస వరలక్ష్మి గారిని నియమించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ గారు విచ్చేసి మాట్లాడుతూ మహిళా సాధికారితపై బీసీ వర్గాల అభివృద్ధిపై తమ కట్టుబాటు వెల్లడించారు.అధ్యక్షురాలు మాట్లాడుతూ బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా మహిళలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు సాగేలా మా బీసీ సేన శక్తివంతంగా పనిచేస్తుందని షాద్ నగర్ నియోజకవర్గంలో మహిళా కమిటీ ఏర్పాటు కావడం ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది మహిళా శక్తికి నూతన దిశను అందిస్తుంది అని పేర్కొన్నారు.అలాగే ప్రభుత్వాన్ని కోరుతూ బీసీ రిజర్వేషన్లు మహిళా సాధికారిత కోసం మరింత బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీ సేన ఎల్లప్పుడూ న్యాయ పోరాటాల్లో ముందుంటుంది. మహిళల హక్కుల కోసం నిరంతరం పని చేస్తుంది అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ షాద్ నగర్ కన్వీనర్ సత్యం టౌన్ అధ్యక్షులు తంగేడు పల్లి శంకర్ కోశాధికారి చందులాల్ ప్రధాన కార్యదర్శి మల్కాపురం రవి అసెంబ్లీ యువజన ఉపాధ్యక్షులు శివ పరుఖ్ నగర్ మండల అధ్యక్షులు మేకల వెంకటేష్,కార్యదర్శి జూపల్లి చంద్రశేఖర్ తదితర బీసీ సేన నాయకులు పాల్గొన్నారు.