
పయనించే సూర్యుడు న్యూస్ :సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ SSMB 29. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా పలు దేశాల్లో ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే .సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది, ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. ఈ నెల 15న ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇవ్వనున్నారు. ఈ నెల 15న రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈనెల 16న మహేష్ బాబు, రాజమౌళి సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని కూడా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామోజీ ఫిలిమ్స్ సిటీలో కాశీ సెట్ వేశారని టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. వారణాసి టైటిల్ తో ఓ సినిమా పోస్టర్ విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్ సీహెచ్ సుబ్బారెడ్డి ‘వారణాసి’ టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆది సాయికుమార్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రఫ్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు సీహెచ్ సుబ్బారెడ్డి. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు వారణాసి అనే సినిమాను అనౌన్స్ చేశారు. రామబ్రహ్మ హనుమ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను ముందే రిజిస్టర్ చేయించామని సుబ్బారెడ్డి తెలిపారు. ఇక దీని పై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.