
పయనించే సూర్యుడు మార్చి 23 టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీకి చెందిన పూనెం రామచంద్రయ్య [Ex: MLA- ZP ఛైర్మెన్ kmm] సతీమణి పూనెం పుల్లమ్మ ఇటీవల గత నెలలో 27వ తారీఖున మరణించిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ కోయగూడెంలోని నివాసంలో వారికి పూలతో నివాళులర్పించారు
కుటుంబ సభ్యులు పూనెం సుధీర్, ముక్తాశ్వరావు, లవకుమార్, కళావతి [ex, సర్పంచ్] రజిత ఈ సందర్భంగా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పూనెం రామచంద్రయ్యతో తనకుఎనలేని సంబంధం ఉందని మీ కుటుంబం అంటే మాకు ఎంతో గౌరవం అని గతంలో ఎంతో సన్నిహిత్తగా ఉండేవాళ్ళం అని గుర్తు చేస్తూ జిల్లా చైర్మన్ తో ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అధైర్య పడవద్దు మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి ఓదార్చారు వారి వెంట కాలే ప్రసాద్ పూనం లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు