
———- కమిటీ ఏర్పాటు చేసి ప్రకటించిన మాజీ మంత్రి, ఉషాశ్రీచరణ్
———-పులేరు పంచాయతీ వైసిపి అధ్యక్షులుగా ప్రతాప్ సింగ్ ,ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక..
పయనించే సూర్యుడు జనవరి 21 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల పరిధిలోని మంగళవారం పులేరు పంచాయతీలో పంచాయతీలోని నాయకులు, కార్యకర్తలుతో కలిసి సమీక్ష సమావేశంను నిర్వహించిన అనంతరం పులేరు పంచాయతీ కమిటీని ఏర్పాటు చేసి ప్రకటించిన మాజీ మంత్రి ,జిల్లా అధ్యక్షురాలు & పెనుకొండ నియోజకవర్గం ఇన్ చార్జ్ ఉషాశ్రీచరణ్
ఈ సందర్భంగా ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు జిల్లా వ్యాప్తంగా నూతన గ్రామ/వార్డు స్ధాయి కమీటీలు ఏర్పాటు చేయడం జరుగుతోంది
ఇలా ఏర్పటు చేయుటకు ముఖ్య ఉద్దేశం గ్రామ స్ధాయి నుండి పార్టీని బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకుని మళ్ళీ సీఎం గా మన మాజీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ని చేసుకుందాం అని పిలుపు నివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వ్యాప్తంగా గోరంట్ల,రొద్దం,సోమందేపల్లి,పెనుకొండ,పరిగి మండలాల కన్వీనర్లు,జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు,జిల్లా కమిటీ సభ్యులు ,జిల్లా అనుబంధ విభాగం పలు అధ్యక్షులు, వైసిపి సీనియర్ నాయకులు ,తాజా మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున్న పాల్గొనడం జరిగింది.పులేరు పంచాయతీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ…
అధ్యక్షులు – ఆర్.ప్రతాప్ సింగ్ ,ఉపాధ్యక్షులు – రామచంద్రారెడ్డి ,మహిళా అధ్యక్షురాలు -మహబూబ్ జాన్ ,రైతు విభాగం అధ్యక్షులు .బి.భాస్కర్ రెడ్డి,బూత్ కమిటి అధ్యక్షులుబి.లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు బి.నాగప్ప,బీసీ సెల్అధ్యక్షులుబాలకృష్ణ ,వెంకటేష్, మైనారిటీ అధ్యక్షులుపి.భాష ,మైనారిటీఉపాధ్యక్షులుడి.బాబు ,సోషల్ మీడియా అధ్యక్షులు ఎ.రమేష్ ఎస్.బాబాజాన్ యువజనవిభాగంఅధ్యక్షులుఎన్ గంగాద్రి,గణేష్ విధ్యార్ధివిభాగంఅధ్యక్షులు డి.మఫీజ్ విధ్యార్ధి విభాగ ఉప అధ్యక్షులు డి.బాబా జాన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపసర్పంచ్ శ్రీనివాసులు .
15.మందిపంచాయతీ కార్యదర్శులు
అంజనేయులు ,రామంజినేయులు ,బెల్లం నారాయణ ,అంజనేయులు ,ఈ. వెంకటేష్,ఎన్ సునీల్ ,పి.అర్షాద్ ,మహేష్ ,డి.కాశీంసాబ్ ,బి.వెంకష్ ,మురళిమోహన్ ,ఎస్.వెంకటేష్ ,గణేష్ వారు ఎంపికయ్యారు