నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఎమ్మెల్యేలు కౌసిక్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్సి వెంకట్ రామ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణ వార్త తెలుసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఎమ్మెల్యేలు కౌసిక్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్సి వెంకట్ రామ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపి సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


