
హాజరైన ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి,యల్ రమణ
పాల్గొన్న ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి,మర్రి రాజశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి,యల్ రమణ,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి,మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.ఈ సందర్భంగా సోమాజిగూడ డివిజన్లోని అన్ని పోలింగ్ భూతులలో ప్రచార కార్యక్రమాల ఏర్పాటు పై చర్చించి మాగంటి సున్నితమ్మకు సోమాజిగూడ డివిజన్లో అధిక మెజారిటీ అందించేలా కృషి చేయాలని చర్చించారు.