
పయనించే సూర్యుడు నవంబర్ 02 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండల బీఆర్ఎస్ పార్టీ యువజన నేత భుక్యా వినోద్ కుమార్ మాజీ మంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ కీలకనేత తన్నీరు హరీష్ రావు ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు మరణించిన విషయంమై హరీష్ రావు గారిని భుక్యా వినోద్ కుమార్ పరామర్శించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించే యువ నాయకుడు భుక్యా వినోద్ కుమార్ తో మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని, ఇటువంటి సమయంలో మా కుటుంబాన్ని కలిసినందుకు సంతోషం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమం లో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు భుక్యా సంజీవ్ నాయక్, ఏన్కూర్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భుక్యా ధర్మా నాయక్, షేక్ బాజీ, షేక్ చాంద్ పాషా, రాచబంటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.