Tuesday, February 25, 2025
Homeఆంధ్రప్రదేశ్మాతృభాషలో విద్యఆ జాతి ప్రజల హక్కుఅంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

మాతృభాషలో విద్యఆ జాతి ప్రజల హక్కుఅంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఒక వెన్నెల రాత్రి పిల్లలంతా వీధిలో ఆటలాడతున్నారు. ఇంతలో ఒక నల్లని మేఘం చంద్రున్ని కప్పేసింది. వెన్నెలపోయింది.వారి ఆట ఆగిపోయింది. అప్పుడు నాలుగేండ్ల బుడతడు అరుగు మీద దుప్పటి కప్పుకుని కూర్చున్న తాత దగ్గరకుపోయి తాత చందమామకు చలివేసిందా నల్లటి దుప్పటి కప్పుకున్నాడు అని ప్రశ్నించాడు.ఏమి చెప్పాలో తెలియని తాత ఈ బుడత తెలివికి,ప్రశ్నకు,ఆలో చనకు మురిసిపోయాడు.ఈ ఘటన విశ్లేషించి చూస్తే నాలుగేండ్ల బుడతడికి పరిశీలించడం విశ్లేషించడం పోల్చడం ప్రశ్నించడం భావవ్యక్తీకరణ జ్ఞప్తికి తెచ్చుకోవడం గుర్తించటం హేతుబద్ధంగా ఆలోచించటం ఊహించటం సృజనాత్మకత మొదలైన అంతర్గత సామర్థాలున్నాయని మనం గ్రహీం చవచ్చు. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే అది మాతృభాష వల్లనే.ప్రపంచ వ్యాప్తంగా అనేకసార్లు రుజువైన విషయమేమిటంటే మాత్రభాష మాధ్యమంగా విద్యలో సాధించిన విజయాలు ఒక పరభాష మాధ్యమంలో ఏమాత్రం సాధించలేమని ఇంట్లో తన పరిసరాల్లో మాట్లాడే భాషలోనే చాలా తేలిగ్గా తమ భావాలు వెల్లడిస్తారు. భావవ్యక్తీకరణ వైపుణ్యం సృజన ప్రశ్న రాన్నికత హేతువు ఇవన్నీ రెట్టింపుగా వుంటాయి.అందుకే గీజూబాయి పిల్లలకు ఇష్టమైన వ్యారానే చదువు చెప్పాలంటాడు.పిల్లలు సినిమాలు షికార్లకు ఎంత ఉత్సాహంగా వెళ్లాలో పాఠశాలలకు కూడా అలా పరుగెత్తాలంటాడు.బాల్యం ఇలా ఎదగాలి. అంతేగాని అసలు వారికి ఏ మాత్రం పరిచయం లేని ఈ సమాజపు జీవన విధానం సంస్కృతి చదువుతో సంబంధం లేని ఒక విదేశీ పరభాషలో చదువులు చెప్పటం అంటే వారిని కచ్చి తంగా శిక్షించటమే ఒకటో తరగతి నుండే ఇంగ్లీష్ మీడియం చదువులంటూ అభం శుభం తెలియని పసిపిల్లలపై దాడి చేయటమే. ఇది మరోరకంగా పిల హక్కుల ఉల్లంఘనే ఈ పిల్లల హక్కుల హననాన్ని ఎవరు ప్రశ్నించరు పిల్లలను ఆడిస్తూ పాడిస్తూ అన్వయిస్తూ ఐన్ స్టీన్ సూత్రాలు మార్క్స్ మిగులు కరిముల్లా విలువ సిద్ధాంతాలు డార్విన్ జీవ పరిమాణ సిద్ధాంతాలు ఇలా ఏదైనా వారు ఆడుతూ పాడుతూ అలవోకగా నేర్చుకుంటారు.కాబట్టి కేజీ నుంచి పీజీ వరకు మొత్తం బోధన అమ్మభాషలోనే సాగాలి అప్పుడే పిల్లల్లో దాగిన సృజనాత్మకశక్తి బయటకు వస్తుంది. వారి మేధన్సు వికసించి భవితకు బంగారు బాటలు పడతాయని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. అందుకే ప్రపంచంలో దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాలు వారి మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నాయి. అద్భుత విజయాలు సాధిస్తున్నాయి అంతేకానీ ఇంగ్లీష్ రాకపోతే విజ్ఞానశా శాస్త్ర గణితం నేర్చు కోలేరన్నది వాస్తవం కాదు విజ్ఞాన శాస్త్ర భావనలు ఒక భాషకు ఒక సంస్కృతికి పరిమితమైనవి కావు రషన్లు ఇదున్లు ఫ్రెంచ్ జపాన్వారు ఇంగ్లీష్ భాష ప్రమేయం లేకుండా మంచి విజ్ఞాన శాస్త్ర నూతన ఆవిష్కరణలు చేశామని సగర్వంగా చెప్పుకుంటారు. 1212 ప్రాంతంలో గణిత విజ్ఞాన శాస్త్ర అధ్యయనంలో ఉత్తమ విద్యాబోధన మొదటి వది స్థానాలు సాధించిన దేశాల్లో తొమ్మిది దేశాల మాధ్యమం ఇంగ్లీష్ కాదు. పైపెచ్చు అవన్నీ కూడా ఆసియా ఖండంలోనివి వీటిలో భారతదేశం లేదు. కానీ ప్రాచీన భారతంలో ఎన్నో అద్బుత ఆవిష్కరణలు జరిగాయి. సున్నాను కనుగొన్నది మనమే. బ్రహ్మగుప్తుడు విక్రమాదిత్యుని కాలంలో న్యూటన్ కంటే ఎంతోముందే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పాడు.ప్లాస్టిక్ సర్జరీ ఆయుర్వేది వైద్య విధానాలు కనుగొన్నది మనమే ఇక్కడ ఆంధ్రబాష నేర్చుకోవటాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు ఇంగ్లీష్ భాషను ఒక భాషగా నేర్చుకోవాలి కాని ఫైన్స్ విజ్ఞాన శాస్త్రాల ద్వారా ఇంగ్లీష్ నేర్పుతామంటే ఇంత కంటే అజ్ఞానం లేదు ఉది అశాస్త్రీయం ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి విధానం లేదు ముందు మాతృభాష నేర్చుకుంటే ఏ ఇతర భాషలైన మూడు నాలుగు నెలల్లో నేర్చుకుంటారని శాస్త్రీయంగా నిరూపించబడినది ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మైనార్జి దళిత బహుజనుల్లో నుండి వచ్చిన అబ్దుల్ కలాం అంటేడ్సన్ వంటివారు కటిక పేదరికం చాపాక్ష్యం నుండి వచ్చినవారే. వీరు వారి మాతృభాషల్లో చదవడం వల్లే జీవితంలో అత్యున్నతస్థాయికి ఎదిగారు సమాజ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. 1900 తర్వాత నూతన ఆర్థిక విధానాల పేరిట దేశం సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్లి పోయింది. మన సంస్కృతి అణిచివేయబడింది. భాష మీద పట్టులేక చరిత్ర సంస్కృతి మీద అవగాహన లేక భావితరం నిర్వీర్యమైపోయింది. ఈ ఖరీదైన ఇంగ్లీష్ చదువులు బానిసలను ఉత్పత్తి వేసింది. భార తీయులకు స్పృహ లేకుండా పోయింది. వీరు డాలర్స్ డ్రీమ్స్ లో విదేశాలకు ఉడిగం చేయడానికి ఈ ఇంగ్లీష్ పక్షుల్లా ఎగిరిపోతున్నారు. వారి తల్లిదండ్రులను ఇక్కడ వృద్ధాశ్రమాల్లో పదిలి పెడుతున్నారు. ఇంతకంటే వ్యక్తి పరాయికరణ మరేముంటుంది జ్ఞానం లోపించిన ఇంగ్లీష్ చదువులు మనిషిని మాన వీయతను, చంపేస్తున్నాయి. వేళు అంతగా కునానీల్లడానికి కారణమవుతున్నాయి.దేశ భవిష్యత్తు తరగతిలో రూపొందకుండా వచ్చీరాని పరాయిభాషలో కొట్టుకుపోతున్నది. ఇది దేశానికి మంచిది కాదు. అసంబద్ధమైన విద్యావ్యవస్థ, చదువులో స్థాయి లేకపోవడటంతో జ్ఞానం లోపించిన విశ్వవిద్యాలయాల పట్టాలు చేతిలో ఉంటున్నాయి. విద్యార్థి లక్షరాస్యుడుగా మాత్రమే కళాశాలలు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వస్తున్నాడు. జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా సమస్యకు గల మూలాలను అర్ధం కోలేకపోతున్నాడు. జీవితం చీకటిమయం అనుకుంటూ ఆందోళనలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. నిలువరించాలి. అందుకని తెలుగుబాషను అభివృద్ది పరచాలి. భాషలోనే అనువరించాలి.తొమ్మిదికోట్ల మంది తెలుగు ప్రజల భాష అయిన తెలుగులోనే విద్య పరిపాలన సాగాలి. చదువంటి జ్ఞానం ఈ జ్ఞానమే మనిషిని దేశాన్ని నిలబెడుతుంది.ప్రపంచంలో ఏదేశం కూడా ఇతరభాషలో తమ బిడ్డలకు చదువు చెప్పడం లేదు ఉన్నత చదువులకు ఇంగ్లీష్ అవసరమనే భావన మంచిదే కానీ అదే జీవితం కాకూడదు. పాలకులు కూడా ఇంగ్లీష్ న్ను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే వారి దుష్టపాలన, విధానాలు దోపీడీని ప్రజలు అర్థం చేసుకోకుండా. ప్రశ్నించకుండా ఉండాలంటే ప్రజాన్ని అజ్ఞానంలోనే ఉండాలి. అందుకు భావం అర్ధం కానీ వృథా చదువుల్లో ప్రజలు కొట్టుకుపోవాలి. అవినీతి నిరంతరం కొనసాగాలి ఈ ఇంగ్లీష్ మీడియం చదువుల వెనుక ఉన్న పాలకుల కుట్రలివి. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్ వారు ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టి వారికి కావాల్సిన గుమస్తాలను తయారు చేసుకున్నారు. కానీ మనవాళ్లు మాత్రం స్వాతంత్య్ర్యానంతరం అదే ఆంగ్లాన్ని కొనసాగిస్తూ ప్రజలకు అర్ధం కాని విధంగా దోపిడీకి పాల్చ దుతున్నారు. ఈ దృక్పథం నుంచి ఆలోచిస్తే కాని ఇది మనకు అర్ధం కాదు. సంస్కృతి వాహికగా, ప్రజల జీవన విధానం చరిత్ర విలువల సంపుటిగా ఒక జాతి భాషను అర్ధం చేసుకోవాలి. మాతృభాషలేని జాతులు ఎక్కడా ఉండవు. ఒక భాష అంతరిస్తే ఒక సంస్కృతి ప్రమా ణంగా ఆ జాతి నశించిపోయినట్టే భావించాలి. వేరే ఏదో పరాయి భాష ఇతర సంస్కృతి వారిని జయించి ఉంటాయి. అవి జాతికి నిజంగానే ఘోర విపత్తు ఇప్పుడు ఈవివత్తు నుండి తెలుగుజాతిని కాపాడుకోవాలి. నేడు అంతర్జాతీయ మాతృభాషా వినోత్సవం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments