
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 31
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం మరియు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధక మరియు మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) సిహెచ్. గోపాలకృష్ణ మరియు సబ్ ఇన్స్పెక్టర్(SI) రమేష్ పాల్గొని విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ శక్తి ఆప్ డౌన్లోడ్ చేసుకోవాలని, స్త్రీలకు లైంగిక వేధింపులు ఎదురైతే ఈ యాప్ ఉపయోగపడుతుందని, మాదక ద్రవ్యాలు బానిస అయితే వివిధ రకాలైన చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు మరియు స్వీయ నియంత్రణను కోల్పోతారని, ప్రతి విద్యార్థి దీనిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం ముఖ్యఅతిథి గోపాలకృష్ణ,రమేష్ లను అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ముల్లి శేఖర్, సీనియర్ అద్యాపకులు జి. వెంకట్రావు, ఎస్.అపనమ్మ, కె. శకుంతల, ఎం.నాగ మోహన్ రావు, బి.శ్రీనివాసరావు, ఆర్.మౌనిక, పి. మౌనిక,ఎన్. ఆనంద్, ఎన్ వివిఎస్ఎన్ మూర్తి, సంగం నాయుడు, శీనయ్య, సుబ్బారావు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
