Thursday, March 27, 2025
Homeతెలంగాణమాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ

మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ

Listen to this article

పయనించే సూర్యుడు, మార్చి24, జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత:-జగ్గయ్యపేట లో స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సోమవారం పట్టణంలోని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐలు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై కమల సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్ వరకు కళాశాల విద్యార్థులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వివిధ ప్రజాసంఘాల నాయకులతో ఈ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లై కార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉక్కు కళా వేదికలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ ప్రణయ్ తేజ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు భగత్ సింగ్ చిత్రపటానికి ట్రైనీమాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ.జగ్గయ్యపేట: స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సోమవారం పట్టణంలోని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐలు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై కమల సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్ వరకు కళాశాల విద్యార్థులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వివిధ ప్రజాసంఘాల నాయకులతో ఈ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లై కార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉక్కు కళా వేదికలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ ప్రణయ్ తేజ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు భగత్ సింగ్ చిత్రపటానికి ట్రైనీ ఐపీఎస్ అధికారిని మనిషా రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనిషా రెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులోనే దేశం కొరకు ఉరి కంబాన్ని ముద్దాడారని, విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలి అన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డ్రగ్స్ వినియోగం జీవితాన్ని నాశనం చేస్తుంది అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిలో ఏదో ఒక స్కీల్ ఉంటుందని దాన్ని గుర్తించి ముందుకెళ్లి లక్ష్యాన్ని చేరుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అన్నారు. ఐద్వా నాయకులు ఎస్ నాగమణి, విశ్వ భారతి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జల్లా తిరుపతిరావు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారినపడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని కాలాన్ని వృధా చేసుకోకుండా లక్ష్య సాధన కోసం కృషి చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ చేయడంతో పాటు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. భారతదేశంలో ఉన్న యువత ఏ దేశంలో కూడా లేదని, యువత సరైన మార్గంలోకి వెళ్లి పనిచేస్తే దేశం దానంతటదే అభివృద్ధి చెందుతున్నారు. నేడు డ్రగ్స్ ను సేవించి తల్లి, చెల్లి, అక్క అనేది కూడా చూడకుండా నేడు వారిపై అఘాయిత్యాలు జరగటం దురదృష్టకరమన్నారు. మహిళలు, యువత, విద్యార్థులు ఏకతాటిపై నిలబడి పోరాడితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు అందరూ సహకరించి డ్రెస్ నిర్మూలన కొరకు పనిచేస్తే డ్రగ్స్ ను నిర్మూలించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సిఐ పి వెంకటేశ్వరరావు, చిల్లకల్లు ఎస్సై టి సూర్య శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్, ఆలీ, ప్రజా సంఘాల నాయకులు ఎం సోమేశ్వరరావు, కె లింగారావు, షేక్ గౌస్ మియా, కె శ్రీనివాస్, దంతాల నరేంద్ర, కాకనబోయిన వెంకటేశ్వర రావు, కోటా రవికుమార్, షేక్ మీరా సాహెబ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఐపీఎస్ అధికారిని మనిషా రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనిషా రెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులోనే దేశం కొరకు ఉరి కంబాన్ని ముద్దాడారని, విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలి అన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డ్రగ్స్ వినియోగం జీవితాన్ని నాశనం చేస్తుంది అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిలో ఏదో ఒక స్కీల్ ఉంటుందని దాన్ని గుర్తించి ముందుకెళ్లి లక్ష్యాన్ని చేరుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అన్నారు. ఐద్వా నాయకులు ఎస్ నాగమణి, విశ్వ భారతి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జల్లా తిరుపతిరావు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారినపడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని కాలాన్ని వృధా చేసుకోకుండా లక్ష్య సాధన కోసం కృషి చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ చేయడంతో పాటు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. భారతదేశంలో ఉన్న యువత ఏ దేశంలో కూడా లేదని, యువత సరైన మార్గంలోకి వెళ్లి పనిచేస్తే దేశం దానంతటదే అభివృద్ధి చెందుతున్నారు. నేడు డ్రగ్స్ ను సేవించి తల్లి, చెల్లి, అక్క అనేది కూడా చూడకుండా నేడు వారిపై అఘాయిత్యాలు జరగటం దురదృష్టకరమన్నారు. మహిళలు, యువత, విద్యార్థులు ఏకతాటిపై నిలబడి పోరాడితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు అందరూ సహకరించి డ్రెస్ నిర్మూలన కొరకు పనిచేస్తే డ్రగ్స్ ను నిర్మూలించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సిఐ పి వెంకటేశ్వరరావు, చిల్లకల్లు ఎస్సై టి సూర్య శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్, ఆలీ, ప్రజా సంఘాల నాయకులు ఎం సోమేశ్వరరావు, కె లింగారావు, షేక్ గౌస్ మియా, కె శ్రీనివాస్, దంతాల నరేంద్ర, కాకనబోయిన వెంకటేశ్వర రావు, కోటా రవికుమార్, షేక్ మీరా సాహెబ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments