
ఎలక్షన్స్ కి సంబంధించిన ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అప్లికేషన్స్ ఇచ్చిన మళ్లీ అవే వార్డు మెంబర్లు వచ్చినందున ఎలక్షన్స్ బాయ్కాట్ చేస్తామని హెచ్చరిస్తున్న దళితులు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 28 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ బాలానగర్ మండల కేంద్రంలోని నేరెళ్లపల్లి గ్రామానికి సంబంధించి గ్రామంలో దాదాపుగా 230 నుండి 240 ఓట్లు ఉండగా మళ్లీ పాత పద్ధతిలోనే వార్డులు కేటాయించారు కనీసం జనాభా ప్రాతిపదికన చూసుకున్న ఒక మూడు వార్డు మెంబర్లు అయినా రావాలని గతంలోనే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి ఎమ్మార్వో ఆఫీస్ ప్రతి ఒక్కరికి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇంకా నోటిఫికేషన్ రానందున మా వర్గానికి రావాల్సిన కోటాలో 3 వార్డు మెంబర్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము లేదంటే మా దళితుల ఓట్లు వేయకుండా ఎలక్షన్ బాయికాట్ చేసేందుకు కూడా వెనుకాడబోమని తెలిపారు