
పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మార్చ్ 1 తేది స్థానిక మక్తల్ కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ వద్ద మాదిగ అమరవీరుల దినోత్సవం MRPS అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమన్ని MRPS నారాయణపేట జిల్లా నాయకులు జీర్గల్ నగేష్ మాదిగ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా పలువురు మాట్లాడుతూ మహా జన నేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి MRPS 30 సంవత్సరాల దండోరా ఉద్యమం ద్వారా ఎస్సీ వర్గీకరణ కోసం గత ప్రభుత్వాలను ముచ్చమటలు పట్టించారు ఎస్సీ వర్గీకరణ కోసం అనేకమంది ప్రాణ త్యాగాలు చేశారు వారి త్యాగాల ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం రాబోతుంది. SC రిజర్వేషన్ల వర్గీకరణలో సవరణ చేసి న్యాయ బద్ధంగా, శాస్త్రీయంగా ABCD లుగా నాలుగు కేటగిరీలు గా చేసి SC లలో ఉండే 59 ఉపకులాలకు వారి జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో…
MRPS జిల్లా నాయకులు జీర్గల్ నగేష్ మాదిగ. ఎమ్మార్పీఎస్ మాజీ నియోజకవర్గ ఇన్చార్జి జి నారాయణ మాదిగ. అడ్వకేట్ డి దత్తాత్రేయ. MRPS మాగనూరు మండల నాయకులు మణిగిరి కృష్ణ మాదిగ. లక్ష్మణ్ మాదిగ.MRPS కృష్ణ మండల నాయకులు బి. తేజ మాదిగ. మక్తల్ మండల బాధ్యులు జగ్గలి అంజప్ప మాదిగ. జ్ఞాన ప్రకాష్ మాదిగ కొండయ్య మాదిగ. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మక్తల్ పృథ్వీరాజ్ . కార్యవర్గ సభ్యులు కల్వర్ నరేష్, రవికుమార్, చిట్యాల ఆటో అంజి మాదిగ. ఉప్పరపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బాలకృష్ణయ్య. సంసర్బండ ఓబ్లేష్ మాదిగ. తదితరులు పాల్గొన్నారు.