
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 కంభం రిపోర్టర్ కే ఆనందబాబు ( మైకెల్) ఫించన్ మంజూరయ్యేంత వరకు నేను డబ్బులుస్తా :: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా కంభం మండలం లో బుధవారం నాడు ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో ఓ వృద్దుడు తనకు ఫించన్ రావడం లేదని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముందు వాపోయాడు.దీనితో చలించిపోయిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వెంటనే తన సహృదయాన్ని చాటుకున్నారు. తనకు ఫించన్ మంజూరు అయ్యేంత వరకు తన సొంత డబ్బులు ఇస్తానని తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు నిజంగా అశోకుడే అంటున్న తెలుగు తమ్ముళ్లు