
పయనించే సూర్యుడు మే 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు సిఐ గంగాధర్ రావు మరో మారు మానవత్వంచాటుకున్నారు. వివరాల మేరకు ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామానికి చెందిన పేరం పెంచలయ్య దివ్యాంగుడు తన స్వగ్రామం నుంచి ఆత్మకూరు కి ట్రై సైకిల్ మీద బయలుదేరాడు. ఆత్మకూరు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ సమీపంలో అదుపుతప్పి మైదానంలోకి దూసుకు వెళ్ళినది. ఆ ప్రాంతంలో ప్రజలు ఎవరూ లేరు అటుగా వాకింగ్ వస్తున్న సిఐ గంగాధర్ రావు అతనిని గమనించి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పెంచలయ్యకు ప్రధమ చికిత్స చేశారు. సిఐ గంగాధర్ రావు నీ స్థానికులు, ప్రజలు అభినందించారు.