
//పయనించే సూర్యుడు// ఆగస్టు 31//
మక్తల్ పట్టణంలో హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం (మానవ హక్కులు, అవినీతి నిరోధక సంస్థ)ఆధ్వర్యంలో స్థానిక నెహ్రు గాంధీ నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం జాతీయ అధ్యక్షులు డాక్టర్ మోహన్ రావు నల్వాడే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్యవివాహాలు గృహహింస మాదకద్రవ్యాలపై ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించడంతోపాటు రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన మానవ హక్కుల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా మానవ హక్కులపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తంగిడి నాగరాజు, ఉపాధ్యక్షులు గవినోల్ల జయపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీరామ్, సెక్రటరీలు సూర్య ఆంజనేయులు ,కేశవరెడ్డి, కట్టా వెంకటేష్, శరణప్ప, సాదిక్ ,నదియా , అరుణ, స్వప్న , విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
