Friday, September 19, 2025
Homeఆంధ్రప్రదేశ్మామిడిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ యొక్క పెన్షన్ డబ్బు దొంగతనం కేసు ఛేదన – రూ.8...

మామిడిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ యొక్క పెన్షన్ డబ్బు దొంగతనం కేసు ఛేదన – రూ.8 లక్షలు రికవరీ..

Listen to this article

,ఇద్దరు నిందితులు అరెస్ట్..

జనంన్యూస్. 19.నిజామాబాదు.

నిజామాబాద్ జిల్లా – మక్లూర్ పోలీస్ స్టేషన్

Cr. No. 208/2025 U/s 331(4),305 BNS

మక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్టుమాస్టర్ శ్రీ బండి నరేందర్ 30.08.2025 న తాను పెన్షన్ పంపిణీ కోసం తీసుకొచ్చిన రూ. 8,00,000/- నగదు 29/30-08-2025 రాత్రి దొంగిలించబడినట్లు ఫిర్యాదు చేయగ కేసు నమోదు చేసి నార్త్ రూరల్ CI శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా, టెక్నికల్ సాక్ష్యాలు ఆధారంగా నిందితులను గుర్తించి, విశ్వసనీయ సమాచారం మేరకు వారిని అరెస్ట్ చేశారు.నిందితుల వివరాలు.డమొల్ల రాకేష్ S/o రాజన్న, వయసు 19 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, రా. నాగేపూర్ గ్రామం, నవీపేట్ మండలం.పత్తి సాయి కుమార్ S/o గంగాధర్, వయసు 23 సంవత్సరాలు, వృత్తి: అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ముబారక్ నగర్), రా. నాగేపూర్ గ్రామం, నవీపేట్ మండలం స్వాధీనం చేసిన వస్తువులు I) ₹7,68,000/- నగదు (పత్తి సాయికుమార్ ఇంటి నుండి) II) ₹32,000/- నగదు (కొండమొల్ల రాకేష్ ఇంటి నుండి) III) నేరానికి వినియోగించిన Dio మోటార్ సైకిల్ IV) EMI పద్ధతిలో కొన్న ఐఫోన్ మొత్తం ₹8,00,000/- (ఎనిమిది లక్షల రూపాయలు) విలువైన నగదు మరియు వస్తువులు స్వాధీనం చేయబడ్డాయి.సంఘటన వివరాలు నిందితుడు పత్తి సాయికుమార్ గత 3 సంవత్సరాలుగా ముబారక్ నగర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నందు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. తన ఉద్యోగ రీత్యా ప్రతి పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన పెన్షన్ డబ్బులు ఎప్పుడు తీసుకొని వస్తారు, వాటిని ఎక్కడ ఉంచుతారు అన్న సమాచారం అతనికి తెలుసు. ఈ కారణంగా సాయికుమార్ కు పెన్షన్ డబ్బులు కాజేయాలనే ఆలోచన కలిగింది. తన దగ్గరి స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన కొండమొల్ల రాకేష్ కు ఈ పథకం వివరించగా, రాకేష్ కూడా అంగీకరించాడు2025 ఆగస్టు 29వ తేదీన సాయికుమార్ కు పరిచయం ఉన్న సహోద్యోగి మామిడిపల్లి BPM నరేంద్ర పెన్షన్ పంపిణీ కోసం 8,00,000/- (ఎనిమిది లక్షల రూపాయలు) నిజామాబాద్ ఆఫీస్ నుండి తెచ్చి తన ఇంట్లో ఉంచుకున్నాడు అనే విషయం సాయికుమార్‌కు తెలిసింఅదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరూ మామిడిపల్లి గ్రామానికి వెళ్లి, పథకం ప్రకారం రాకేష్‌ను గుర్తు తెలియని వ్యక్తిగా నరేంద్ర ఇంట్లో ఆశ్రయం పొందేలా చేశాడు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత, రాకేష్ అక్కడి నుండి పెన్షన్ డబ్బులు గల బ్యాగ్‌ను దొంగిలించి, సాయికుమార్ వద్దకు తీసుకెళ్లాడు. తరువాత ఇద్దరూ కలసి డబ్బులు ఎవరికి అనుమానం రాకుండా సాయికుమార్ ఇంట్లో దాచిపెట్టారు.మక్లూర్ పోలీసులు సమయోచితంగా చర్యలు తీసుకోవడంతో మొత్తం నగదు తిరిగి రికవరీ చేయబడింది. నిందితులను అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానంలో రిమాండ్ కు హాజరు పరిచారు.అయితే ఇట్టి కేసులో అత్యంత చాకచక్యంగా పక్కా సాంకేతిక ఆధారంతో నార్త్ రూరల్ CI శ్రీ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇట్టి కేసును చేదించడంలో కృషిచేసిన, శ్రీ ఎం. రాజశేఖర్, ఎస్ఐ మక్లూర్ మరియు సిబ్బంది రాజేశ్వర్, రాజారెడ్డి, రాకేష్, దత్తద్రి గౌడ్, రాజు, చరణ్, IT కోర్ సిబ్బంది సాగర్, సందీప్ లను అభినందించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments