పయనించే సూర్యడు జనవరి 21 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన చైర్మన్ గా ఎన్నికైన నడిగూడెం గ్రామానికి చెందిన వేపూరి
తిరుపమ్మ సుధీర్ ను నడిగూడెం గ్రామానికి చెందిన దళిత నేతలు దాసరి శ్రీనివాస్, కత్తి విజయ్, ఆదిమళ్ల సురేష్ కుమార్ లు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మంగళవారం శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
యువకుడిగా నీతి నిజాయితీగా పార్టీ కోసం కార్యకర్తల కోసం కష్టపడ్డ కార్యకర్తకు పార్టీ గుర్తించి పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేసి గ్రామానికి మండలానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు
మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన దళిత నేతలు
RELATED ARTICLES