
సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం…
రుద్రూర్, మార్చ్ 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
మార్చ్ 25న జిపి కార్మికుల ఛలో హైదరాబాద్ జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి యేషాల గంగాధర్ కోరారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 26,000 చెల్లించాలని, పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చ్ 25న జీపి కార్మికులు ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టుకున్నామని గ్రామపంచాయతీ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నన్నేసాబ్, జీపి కార్మికులు శంకర్, గంగారం, లక్ష్మి,, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.