పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరుడివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 10
ఏడుగురాళ్లపల్లి సంతలో శుక్రవారం చింతూరు సి ఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో సంతకు వచ్చిన ప్రజలతో మమేకమై వివిధ గ్రామాల్లో ప్రజలతో మావోయిస్టుల ఉనికిని పసిగట్టి తమకు తెలపాలని కోరారు. తెలిపిన వారి పేర్లను గొప్యం గా ఉంచుతామని పేర్కొన్నారు. అలాగే సైబర్ నేరాల గురించి, ట్రాఫిక్ నియమ నిబంధనలు గూర్చి తెలిపారు. డిజిటల్ అరెస్ట్ నెపంతో ఫోను ద్వారా బెదిరించి చేయు ఆర్థిక నేరాలు, మోసాలు గూర్చి అవగాహన కల్పించారు, ఇతర ఆర్థికంగా జరిగే మోసాల గూర్చి వివరించారు . ఈ సందర్భంగా ఏడుగురాళ్ళ పల్లి సంత మార్కెట్ ఏరియా లోను, సర్వేల గ్రామంలోనూ డ్రోన్ కెమెరాలతో ఏరియాను సర్వే చేసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


