
నేషనల్ స్టార్ ఎక్సెలెన్స్ అవార్డు అందుకున్న అహ్మద్ ఖాన్ మాస్టర్ ను అభినందనలు తెలిపిన కవిత
( పయనించే సూర్యుడు ఆగస్టు 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ని విజయవాడ పట్టణం లో YMC అకాడమీ అధ్యర్యంలో జరిగిన నేషనల్ స్టార్ ఎక్సెలెన్స్ అవార్డు ఫంక్షన్ లో మార్షల్ ఆర్ట్స్ విభాగం లో అవార్డు పొందిన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ ను బుధవారం రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్మానించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తన నివాసం లో అహ్మద్ ఖాన్ మాస్టర్ ను ఆహ్వానించి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తు లో ఇంకా ఇలాంటి అవార్డు లు ఎన్నో పొందాలని అన్నారు. కుంగ్ ఫు లో చిన్నారులకు, ఆడపిల్లలకు శిక్షణ ఇస్తూ వారిని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లో పేరు తీసుకొచ్చే విదంగా తీర్చిదిద్దుతునందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్సీ కవిత ను కలిసిన వారిలో తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా మాజీ కన్వినర్ అర్చన సేనాపతి, తెలంగాణ జాగృతి షాద్ నగర్ కన్వినర్ యండి. ముస్తఫా, ఇర్ఫాన్ ఖాన్, సమీర్ బేగ్, ఆవుల రమేష్, జంగం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
