
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
జాతీయ 77 వ చార్టెడ్ అకౌంట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమీర్పేట్ లోని మాస్టర్ మైండ్స్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం కళాశాల ఆవరణ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిడి భీమిరెడ్డి పాల్గొని కళాశాల నిర్వాహకులను అభినందించారు. 77వ చార్టెడ్ అకౌంట్ దినోత్సవం పురస్కరించుకొని సీఏ చదువుతున్న విద్యార్థులకు సామాజిక సృహ కల్పించడం హర్షనీయమన్నారు. కళాశాల జోనల్ అడ్మిన్ ప్రిన్సిపల్ ఎస్ ఎం వలి మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు మాస్టర్ మైండ్స్ కృషి చేస్తుందన్నారు. సామాజిక స్పృహను కల్పించడంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు చక్కగా కార్యక్రమం లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మాస్టర్ మైండ్స్ అమీర్పేట్ బ్రాంచ్ ప్రిన్సిపల్ అశోక్, రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్లు ఆయుబ్ ఖాన్, రమేష్, శ్రీనివాసరావు, జితేందర్ కుమార్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
