
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 22
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కుమ్మూరు పంచాయతీ మామిళ్ళగూడెం గ్రామంలో గోడత గుంపు అనే వీధిలో గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మట్టి రోడ్డు పోయడం జరిగింది. ఆ మట్టి రోడ్లో వర్షాకాలంలో మొత్తం బురద మాయం అవ్వడం వలన గ్రామస్తులు తిరగడానికి కూడా వీలు లేకుండా ఉంది, ఆ గుంపులో 22 కుటుంబాలు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తారు కనీసం ఎమర్జెన్సీ అప్పుడు చింతూరు హాస్పిటల్ కి వెళ్ళడానికి కూడా వీరు లేకుండా ఉంది ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ కానీ టూ వీలర్ కానీ ఆటో ఏ వాహనమైన వెళ్లడానికి వీలు లేకుండా ఈ రోడ్డు ఉంది, మాకు ఈ మట్టి రోడ్లో గ్రావెల్ పోసి రోడ్డును మరమ్మత్తులు చేయాలని ఈరోజు ఏపీఓ కి మామిళ్ళగూడెం గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు, కార్యక్రమంలో శ్యామల శోభన, శ్యామల ధర్మయ్య, ముచ్చిక బాబురావు, ముచ్చిక నర్సింహా రావు, ముచ్చిక రవీంద్ర.తదితరులు పాల్గొన్నారు.
