ప్రయణించే సూర్యుడు న్యూస్ జనవరి 26 మిడ్జిల్ రిపోర్టర్ బి. శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో, ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా తాసిల్దార్ పులిరాజా, ఎంపీడీవో గీతాంజలి ఆధ్వర్యంలో నిర్వహించారు.ముందుగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవం విశిష్టతను మరియు భారత రాజ్యాంగం పట్ల అంబేద్కర్ చేసిన సేవలు గురించి తాసిల్దార్ వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బ్రిటీష్ రాజ్యం నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, ఎన్నో దేశాలలో రాసుకున్న రాజ్యాంగాలు విఫలం అయ్యాయి మన భారతదేశంలో 76 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అని గౌరవిస్తూ ఘనంగా వేడుకలను నిర్వహించారు. బోయిన్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర పంచాయతీ కార్యదర్శి వావిళ్ళ శ్రీనివాసులు మరియు యుపిఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఆధ్వర్యంలో అంగన్వాడి పాఠశాల బోయిన్ పల్లి దగ్గర 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు సంబంధించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ లో ప్రభుత్వ కార్యాలయలో ఘనంగా 76 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
RELATED ARTICLES