
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఎస్సి విఎల్ఈ సొసైటీ జాయింట్ సెక్రెటరీ ధరావత్ సాయి కృష్ణ
గ్రామీణ డిజిటల్ సేవల సమాఖ్య డిమాండ్
పయనించే సూర్యుడు జులై 23 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :మీసేవ సేవలను ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా వీఎల్ఎలకు అన్యాయం..వీఎల్ఎల కష్టాలను గుర్తించి ప్రభుత్వ పరిరక్షణ కల్పించాలి మీసేవ సిఎస్సి వి ఎల్ఏలకు రెండింటికీ సమాన అవకాశాలు కల్పించటం వలన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలకు డిజిటల్ సేవలను అందిస్తూ సీఎస్సీ వీఎల్ఎలు(విలేజ్ లెవల్ ఎంట్రప్రెనర్స్) ఎంతో సమర్థంగా పనిచేస్తున్నారు. గ్రామాల నుండి జిల్లాలకూ వెళ్లకుండానే పౌరులు నిత్యావసర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, రేషన్, పెన్షన్, స్కాలర్షిప్, పాన్ కార్డు, వంటి ఎన్నో ప్రభుత్వ సేవలు పొందడానికి సీఎస్సీ కేంద్రాలు ప్రధాన వేదికగా మారాయి. కానీ, ఇటీవల మీసేవ కమిషనర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మీసేవ సేవలను ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మాత్రమే ఇవ్వాలన్నది వీఎల్ఎలకు అన్యాయం చేయడం జరుగుతుంది. మీ సేవ సేవలు కూడా గ్రామీణ ప్రజలకు చేరువ చేయడం కోసం పనిచేస్తున్న వీఎల్ఎలకు ఇవ్వడం వలన ప్రభుత్వానికి భారం తగ్గి, ప్రజలకు ఎక్కువగా లబ్ది చేకూరుతుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సీఎస్సీ వీఎల్ఎ డిమాండ్స్ -మీసేవ సేవలను సీఎస్సీ వీఎల్ఎలకు అందుబాటులోకి తీసుకువచ్చి వీఎస్ఏ కేంద్రాల ద్వారా అందించాలి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఒకే కేంద్రంలో అన్ని రకాల సేవలు లభించే విధంగా చర్యలు తీసుకోవాలి. -వీఎల్ఎల కష్టాలను గుర్తించి ప్రభుత్వ పరిరక్షణ కల్పించాలి -గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ భారత్ లక్ష్య సాధనకు వీఎల్ఎలు మద్దతు.. -మీసేవ సేవలను వీఎల్ ఏలకు అప్పగించడం ద్వారా గ్రామీణ పౌరులు మరింతగా లబ్ది పొందతారు.ప్రభుత్వం వీఎన్ఏలకు న్యాయం చేయాలి సీఎస్సీ వీ.ఎల్.ఎ.లకు పూర్తి స్థాయి మీసేవ సర్వీసులు కేటాయించాలి. ప్రస్తుతం మీసేవ కమిషనర్ తీసుకున్న నిర్ణయం రద్దు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సులభంగా సమర్థంగా ప్రభుత్వ సేవలు అందించడంలో సిఎస్సి వీఎల్ ఏలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీఎల్ఎలు గత కొన్ని ఏళ్లుగా తమ సొంత పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ ప్రభుత్వానికి తోడ్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీసేవ కేంద్రాల ద్వారా అందుతున్న అన్ని సేవలను సిఎస్సి వీఎల్ఎలకు కూడా కేటాయించి,వారు ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించేలా ప్రభుత్వం ప్రోత్సహిం చాలి. -ఒకవైపు మీసేవ, మరోవైపు సిఎస్సి వీఎన్ఏలు రెండింటికీ సమాన అవకాశాలు కల్పించటం వలన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ప్రజలకు మరింత విస్తృతంగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయి -మనం కోరేది స్పష్టంగా మీసేవ సర్వీసు లను సిఎస్సి వీఎల్ లకు పూర్తిగా ఇవ్వాలి. -వీటి నిర్వహణకు అవసర మైన సాంకేతిక మద్దతు, శిక్షణ సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చాలి గ్రామీణ డిజిటల్ భారత్ ను ముందుకు తీసుకెళ్ళాలంటే సిఎస్సి వీఎల్ఎ లతో మీసేవను కలిపి, ఒకే దరిమిలా సేవలు అందించడం తగిన మార్గం అవుతుందని సిఎస్సి. వీ.ఎల్. ఏల , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సి ఎస్ సి వి ఎల్ ఈ సొసైటీ జాయింట్ సెక్రెటరీ ధరావత్ సాయి కృష్ణ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు