
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్
ముందస్తు అడ్మిషన్లు నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలు ఏవి
విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి ఏఐఎస్ఎఫ్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
షాద్నగర్ : రాష్ట్రంలో ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ కళాశాలలు 2025 -2026విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తున్న అధికారులు మాత్రం ముద్దు నిద్ర వీడటం లేదని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ అన్నారు.
ఆకాష్ నాయక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ , మరియు ఇంటర్మీడియట్ కళాశాలలో అప్పుడే అడ్మిషన్ పూర్తయినట్టు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు చెప్పడం బాధాకరమన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు రంగురంగు బ్రోచర్లు తో ప్రచారం చేస్తూ తమ కళాశాల తమ పాఠశాలలోనే చేరాలంటూ పిఆర్వోలు ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్ చేస్తే ఫీజులో రాయితీ కల్పిస్తామంటూ విద్యార్థులు తల్లిదండ్రులను మాయమాటలుతో బురుడి కొట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.పీజుల పేరుతో వసూలు దండయాత్ర కొనసాగిస్తున్నారన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో పుట్టగొడుగుల పుట్టకొస్తున్న ప్రైవేట్,కార్పొరేట్ కళాశాలలు.పాఠశాలలు నియంత్రించడంలో ప్రభుత్వాలు , ప్రభుత్వ అధికారులు గాని దొంద వైఖరిని ప్రదర్శిస్తున్నాయన్నారు. విద్యను సంతలో సరుకుగా మార్చేశాయని అడ్మిషన్ తీసుకోవాలంటే డొనేషన్ల బుక్స్ కు సపరేటు యూనిఫామ్ సపరేట్ అని ఐఐటి పౌండేషన్ సపరేట్ సపరేట్ అని ఇలా రకరకాల బ్రోచర్స్ లో లేని పేర్లతోనే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందే తప్ప ఫీజులు నియంత్రించడంలో విఫలమైందన్నారు. తల్లిదండ్రులు కార్పొరేట్ మోజు ప్రైవేట్ విద్యా సంస్థలకు కాసులు వసూలకు అవకాశంగా మారిందన్నారు. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అక్రమ వసూళ్లకు తెరలేపుతున్నారని అన్నారు విద్య హక్కు చట్టం సెక్షన్ 6 నిబంధనలో ప్రకారం అడ్మిషన్ జరగాలి సెక్షన్ 11 ప్రకారం ప్రైవేట్ యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించే పీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నా ఆ నిబంధన ప్రకారం విద్యార్థుల నుంచి వసులు చేస్తున్న ఫీజులు వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలని అన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ పేర్లతో విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దునీడ వీడి ముందస్తుగా అడ్మిషన్స్ నిర్వహించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.