
బీసీలకు 42% రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకమని మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్
( పయనించే సూర్యుడు మార్చి 21 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ )
కేశంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న రు. బీసీలకు 42% రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్లులోకి ఆమోదం తెలపడం హర్షణీయమైనదని చరిత్ర ఆత్మకమని షాద్నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిపిశెట్టి కరుణాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడ వీరేశ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు పాలభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.