
జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 29
ముఖ్యమంత్రి గారు అంతర్రాష్ట్రాలను కలిపే రహాదారి నిర్మాణం చేపట్టాలని
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి జిల్లా చైర్మన్ రామారావుదొర వినతి పత్రం ద్వారా కోరారు.ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ,ఒడిషా,చత్తీష్ఘర్ రాష్ట్రాల వైపు వెళ్లే రహదారి(విశాఖపట్నం నుండి భద్రాచలం రహాదారి) అల్లూరి సీతారామరాజు జిల్లా జికె వీధి మండలం ఆర్వీనగర్ నుండి వై రామవరం మండలం పాలగెడ్డ వరకు పూర్తిగా చిధిలమైపోయిందని,గతంలో ఈ 75.కిమీ అంతర్రాష్ట్ర రహాదారికి సమారు 84కోట్ల రూపాయలు 2014-19 మధ్య కాలంలో తెదేపా ప్రభుత్వం హయాంలో నిధులు విడుదల చేసినప్పటికీ రహాదారి పనులు చేయలేదని,ఈ రహాదారి మీదుగా వివిధ రాష్ట్రాలకు ప్రయాణం చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వైద్యపరంగా ఐదు పీ హెచ్ సి ల ప్రజలు అనగా మంగంపాడు. సీలేరు. దారకొండ. సప్పర్ల. గూడెం కొత్త వీధి పేషెంట్లు ఈ రహదారి మీదనే ప్రయాణం చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. డొంకరాయి, సీలేరు. మోతుగూడెం జల విద్యుత్తు ప్రాజెక్టులకు సంబంధించిన ఉద్యోగులు,ఆ ప్రాంతంలో నివసించే సుమారు 100 గ్రామాల ప్రజలకు ముఖ్యంగా ఆదివాసీప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఇదే రహాదారి మీదుగా ఇటు పాడేరు గానీ, నర్సీపట్నం గానీ, విశాఖపట్నం గానీ, అటు భద్రాచలం గానీ వెళ్ళవలసి ఉంటుంది.అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా సకాలంలో అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని,ఒకవైపు దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఆదివాసీ పల్లెల్లోకి అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉందంటే ఉదాహరణకు ఈ రహదారే ఒక నిదర్శనం.అంతర్రాష్టలను కలిపే ఈ రహదారిని త్వరగా బాగు చేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి ఇంటలెక్సవల్ మెంబర్ నర్సి పాపారావు,గిరిజన విద్యార్థి సంఘం ప్రతినిధులు మణుగూరి బాబి, బూడిద మాధవరావు, అనిల్, రవి,శంకర్ తదితరులు పాల్గొన్నారు.