పాలకుర్తి నియోజకవర్గ, అభివృద్ధి, సమస్యల పట్ల, ప్రత్యేక సమావేశం
పయనించే సూర్యుడు ప్రతినిధి (శ్రీరామ్ నవీన్), తొర్రూరు డివిజన్ కేంద్రం
పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మరియు నియోజకవర్గం ఇన్చార్జి ఝాన్సీ డా,రాజేందర్ రెడ్డి తమ కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి నీ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు
ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి, వారితో అనేక అంశాలపై ఆత్మీయంగా చర్చించారు. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కీలకమైన అంశాలను ప్రస్తావించారు..
ఈ సందర్బంగా, శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక, సంక్రాంతి పండుగను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు..
పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో అద్భుతమైన మార్పు తీసుకువచ్చాయని ప్రశంసించారు. ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా వారు పలు అభివృద్ధి సమస్యలను ప్రధానంగా ప్రస్తావించి, వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి మద్దతు తీసుకున్నారు….