
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
పయనించేసూర్యుడు:ఏప్రిల్ 05: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
ములుగు:ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ రోడ్ కి చెందిన ఎమ్ డి.నస్రత్ కి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ అధ్వర్యంలో,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న’చే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు’ను మంజూరు చేసి, మల్లన్న చేతుల మీదుగా నస్రత్ కూమారుడు ఎమ్డీ హైమద్ పాషా’కి తన కార్యాలయంలో అందివ్వడం జరిగింది. తదనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం. ఈ రోజు అచ్చునూరి కిషన్ లబ్ధిదారురాలు ఎమ్డీ నస్రత్ ఇంటికి వెళ్ళి ఇటీవల మంజూరు అయినా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు’ను ఆమె’కు ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ, పేదవర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఎంతో, కొంత భరోసా గా ఉంటుందని, అనారోగ్యంతో బాధపడుతు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఆర్థిక భారం’తో ఇబ్బందిపడ్డ, పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అనేది కొంత భరోసా’గా ఉండడం జరుగుతుందని కావున బాధితులు ఎవరు ఉన్న ముఖ్యమంత్రి సహాయనిధి’ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సూచించారని కిషన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.