జనం న్యూస్ -జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో గత రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు ముగిశాయి, బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల కొండ అన్నపూర్ణ, సివిల్ కాంట్రాక్టర్ టినవీన్ కుమార్ పాల్గొన్నారు, విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు, ఓవరాల్ ఛాంపియన్గా సూర్యాపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నిలువగా, కోకో మొదటి బహుమతి మరియు వాలీబాల్ ద్వితీయ బహుమతి నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు గెలుపొందారు, ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఐలయ్య, బోధనా సిబ్బంది వివిధ కళాశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు .