
పయనించే సూర్యుడు నవంబర్ 2,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి సోషల్ మీడియా పిఆర్వో ముద్దం నాగ నవీన్ కూతురు చిరంజీవి ముద్దం వన్షిక రెండవ పుట్టినరోజు వేడుక సందర్భంగా మంత్రి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయం నందు కలిశారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు చిన్నారి వన్షికను మనసారా ఆశీర్వదించారు. చిన్నారి వన్షిక నిండు నూరేళ్లు జీవించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ముద్దం నాగ నవీన్ గారు మంత్రి ఫరూక్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనతో పాటు కార్యక్రమంలో పసుపులేటి మీనాక్షి ఉన్నారు
