
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
సర్దార్ పుట్టాం పురుషోత్తంరావు పటేల్, రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్రం నలుమూలల నుండి కుల బాంధవులు హైదరాబాదు నుండి శుక్రవారం ఉదయం బయలుదేరి వేములవాడకు మధ్యాహ్నం చేరుకొని కుల బాంధవులు అందరూ కలిసి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొని, అక్కడినుంచి శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించి అనంతరం ఒంటిగంటకు వేములవాడ తాటికొండ రాజయ్య ఫంక్షన్ హాల్లో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యవర్గాలు, అన్ని మండలాల అధ్యక్షులు కార్యవర్గాలు, అన్ని పట్టణాల అధ్యక్షులు కార్యవర్గాలు, అన్ని గ్రామాల అధ్యక్షులు కార్యవర్గాలు, కూకట్ పల్లి నియోజవర్గం నుంచి తూము మనోజ్ కుమార్, యంజాల పద్మయ్య, బాష్టిశెట్టి నర్సింగ్ రావు, జిల్లా అజిత్ రావు, గున్నాల వినోద్, తూము వివేక్, ఆకుల బాలకృష్ణ, తెల్ల హరికృష్ణ, సప్పిడి వెంకటేష్, పోలీస్ శీను, తూము శ్రీనివాస్, కుల బాంధవులు అందరూ పాల్గొన్నారు, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ తూము మనోజ్ కుమార్ కార్యదర్శి గా యంజాల పద్మయ్య కార్యనిర్వక కార్యదర్శి గా నియమితులై ప్రమాణస్వీకారం చేసిన వారిద్దరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్నూరు కాపు అభ్యున్నతకు పాటుపడాలని, రాజకీయ రంగంలో మున్నూరు కాపులు ఎదిగేవిధంగా ప్రణాళికలు రూపొందించి రాజాధికార దిశగా మున్నూరు కాపులను తీసుకెళ్లాలని కోరారు.