పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట పురపాలక పరిధిలో బొగ్గుల కాలనీ అనే ఒక ఏరియా ఉన్నదని సంగతి పాలకులు మరిచినట్లున్నారు ఓ పాలకుల్లారా మేము మనుషులమే ఒకసారి మా దీనస్థితిని చూడండి బొగ్గుల కాలనీ మొత్తం ఎస్సీలు ఉన్నారని పాలకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా దీనస్థితిని కళ్ళు తెరిచి చూడండి ఒకసారి
గ్రామపంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ గా మారినంతవరకు మా బొగ్గుల కాలనీలో ఎటువంటి మార్పు రాలేదు పరిశుభ్రత గురించి అస్సలు పట్టించుకోలేదే ఎందుకు ఇక్కడివారు పన్ను చెల్లించడం లేదా ఎన్నికలకు ఓట్లు వేయ లే దా?సామాన్యులకు కల్పిం చవలసిన ప్రాథ మిక వస తులను కూడా మీరు బొగ్గు ల కాలనీకి కల్పించలేరా ఈ కాలనీ పరిధిలో మరియు రైల్వే స్టేషన్ దాకా అధికంగా పందులు తిరుగులాడుతున్నా దీనిపై మౌనం వహించడం ఏల ఈ కాలనీ పరిధిలో చెత్తను తీసుకెళ్లేందుకు కూడా సిబ్బంది ఎవరు వచ్చినట్లుగా లేదు ఎక్కడ చూసినా పరిశుభ్రత కరువై చాలా ఘోరంగా ఉన్నది దీని గురించి సానిటరీ ఇన్పెక్షన్ కూడా చేసే వారె వరూ లేరా? పట్టణ ప్రాంతాలలో మాత్రం అత్యధికంగా పార్టీ ప్రతినిధులు అధికారులు ఉండే దగ్గర రోజుకు రెండుసార్లు పరిశుభ్రంగా ఆ ప్రాంతాలను ఉంచేందుకు సిబ్బంది పని చేస్తున్నారు కానీ ఈ పట్టణ శివారు ప్రాంతంగా ఉన్న బొగ్గుల కాలనీని పరిశు భ్రంగా ఉంచుకోవాలన్నా ఆలో చన కూడా మున్సిపల్ అధికార సిబ్బందికి కలగడం లేదా? అసలు ఇంతకీ ఈ ఏరియా కు సంబంధించిన కౌన్సిలర్ గారైన దీనిపై ప్రశ్నిస్తారా ఈ విషయమై వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఈ పరిసరాలలో నివసించు ప్రజలను అనా రోగ్యాలపాలు కాకుండా చూడాలి ఎక్కడ చూసిన పందులే ఎక్కడ చూసినా చెత్త సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం ఎంతోమంది ఎస్సీ ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఎస్సీలు ఉండే బొగ్గులు కాలనీ పరిస్థితి మాత్రం మారలేదు ఇకనైనా సంబంధిత అధికారులు బొగ్గుల కాలనీ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి మా ఆరోగ్యానికి కాపాడండి మహాప్రభో


