
(పయనించే సూర్యుడు అక్టోబర్ 14 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలంలోని అంగన్వాడి మూడవ సెంటర్లో పోషణ మహోత్సవంలో భాగంగా గర్భవతులు బాలింతలు మరియు కిశోర బాలికలకు ఆరోగ్యము మరియు పరిరక్షణ పిల్లల ఎదుగుదల పైన అవగాహన కల్పించడం జరిగింది. కిషోర్ బాలికలు గర్భవతులు బాలింతలో మరియు పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. రోజు తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు మాంసకృతులు విటమిన్స్ ఖనిజలవనాలు వాటితో పాటుగా మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం గా ఉంటారు. సమతుల్య ఆహారం తీసుకుంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరియుECCE. బాల్య సంరక్షణ మరియు విద్య గురించి తెలియజేయడం జరిగింది. పిల్లలు పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటేనే అంగన్వాడి విద్యను త్వరగా అర్థం చేసుకొని హ్యాపీగా పాల్గొనడం జరుగుతుంది. పిల్లలు మెదడు అభివృద్ధి అనేది ఆరు సంవత్సరాల లోపు 85% కాబట్టి ఈ వయసులో పిల్లలకు హాటపాటలు విద్య అనేది ముఖ్యం ఎందుకంటే పిల్లలు ఆటపాటలతో విద్య నేర్పించడం కథలు చెప్పడం రాయడం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రేఖ. హెల్త్ సూపర్వైజర్ అమరావతి. పై మరియు స్కూల్ హెచ్ఎం జ్యోతి. జిల్లా బాలల పరిరక్షణ భాగం కౌన్సిలర్ నర్సింలు. ఆశా కార్యకర్త బాలమణి. అంగన్వాడి టీచర్లు రమాదేవి. గిరిజ. ప్రతిభ. రాధిక. సరోజ. తదితరులు పాల్గొనడం జరిగింది