Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్మూడున్నర లక్షల రూ పాయలకు తైబజార్ వేలం..

మూడున్నర లక్షల రూ పాయలకు తైబజార్ వేలం..

Listen to this article

ఫోటో : సెక్రటరీని సన్మానిస్తున్న దృశ్యం…

రుద్రూర్, ఏప్రిల్ 03 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)

రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం తై బజార్ వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో పలువురు పాల్గొన్నారు. రుద్రూర్ గ్రామానికి చెందిన అంజాద్, వంజరి సీతారాంలు మూడున్నర లక్షల రూపాయాలకు తై బజార్, వారంతపు సంతను వేలంలో దక్కించుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ సెక్రటరీ గంగాధర్ ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో షేక్ నిస్సార్, అంజాద్, సీతారాం, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments