
పయనించే సూర్యుడు మే 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
కుట్టు శిక్షణ పేరుతో రూ.150 కోట్లు దండుకునేందుకు సిద్దమయ్యారు
బీసీలకు న్యాయం చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే .మంత్రి ఆనం నియోజకవర్గంలో మాఫియాపై దృష్టి సారించండి
. మేకపాటి కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆ పార్టీ తమ వారికి లబ్ది చేకూర్చేలా అన్ని పథకాలను అమలు చేస్తుందని, దీంతో మూడు స్కీములు, ఆరు స్కాములుగా కూటమి పాలన సాగుతుందని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు.ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరులోని మేకపాటి కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామిలు అమలు చేయకుండా స్కీంలు ఏర్పాటు చేసి బీసీ మహిళలను ఆదుకుంటామని చెప్పి పథకాలను ప్రవేశపెట్టారని, అయితే కుట్టు మిషన్లు శిక్షణ పేరుతో భారీ అవినీతికి తెరలేపారన్నారు.మహిళలకు కుట్టు శిక్షణ కోసం రూ.221.08 కోట్లు కేటాయించారని, అందులోఒక్కొ మహిళకు శిక్షణ కోసం రూ.3వేలు, మిషన్ కోసం రూ.4300 ఇచ్చారని, ఆ విధంగా చూసుకుంటే రూ.75.06 కోట్లే అవుతుందని, మిగిలిన రూ.154 కోట్లకు లెక్కే లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఈబీసీ నేస్తం, జగనన్న చేయూత, ఆసరా, అమ్మఒడి పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా ఆదుకున్నారని పేర్కొన్నారు.ఆత్మకూరు పట్టణం, రూరల్ రెండు కేంద్రాలు పట్టణంలోని శిక్షణ అందిస్తున్నాయని, పరిశీలించేందుకు వెళితే అక్కడ 5 నుండి 6 మంది మహిళలే శిక్షణ తీసుకుంటున్నట్లుగా ఉందని, లెక్కల్లో మాత్రం ఎంతో మంది శిక్షణ తీసుకుంటున్నట్లుగా చూపుతున్నారని, ఇలా అవినీతిమయంగా పాలన సాగుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తే ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించారు.నిబంధనల ప్రకారం 45 రోజులకు దాదాపు 360 గంటల శిక్షణ ఇవ్వాల్సి ఉంటే కేవలం 135 గంటలు మాత్రమే శిక్షణ ఇస్తున్నారని, అందులో కూడా ట్రైనింగ్ కిట్ లు ఇవ్వడం లేదన్నారు. టెండర్ల ప్రక్రియలోనూ ప్రి బిడ్ లో మొత్తం 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించారన్నారు. వారికి అనుకూలంగా టెండర్ల ప్రక్రియ చేపట్టారని, దీంతో వారి అవినీతికి మార్గం సుగమమం చేసుకున్నారని విమర్శించారు.ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తమ కూటమి నేతలు ఏం చేస్తున్నారో గమనించాలని, మట్టి మాఫియాగా ఏర్పడి మైనింగ్ చేస్తూ ప్రైవేట్ లేఅవుట్లకు మట్టిని తోలి లక్షలు సంపాదిస్తున్నారని, ఇంత యధేచ్చగా దోపిడి సాగిస్తున్నారో తెలుసుకోవాలని, అవినీతి ఏ స్థాయిలో ఆత్మకూరులో జరుగుతుందో పరిశీలించాలని పేర్కొన్నారు.సింహాచలంలోని అప్పన్న గుడి వద్ద గోడ కూలి ఏడు మంది చనిపోయారని, అసలు పిల్లర్లు లేకుండా నిర్మాణం చేయడం, అమాత్యులు, అధికారులందరూ పరిశీలించామని చెప్పిన తరువాత కూడా ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం, మీ శాఖ పరిధిలో ఇది జరగడం అవినీతికి, దోపిడి అన్ని ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు అమలుకు నోచుకోలేదు కానీ బీసీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడికి పాల్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు