పయనించే సూర్యుడు అక్టోబర్ 29,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామానికి చెందిన గజ్జెల మల్లేశ్వరి కుమారుడు 3 నెలల చిన్నారి ( భూమా యశ్వంత్ రెడ్డి ) కొద్ది రోజుల నుండి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.తప్పనిసరిగా సర్జరీ (ఆపరేషన్) చేయాలని వైద్యులు చెప్పడంతో ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్న చిన్నారి తల్లి నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరికి ఫోన్ కాల్ చేసి విషయం చెప్పిన వెంటనే స్పందించిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి LOC కోసం ఎంపీ లెటర్ ఇచ్చి విజయవాడలో సంబంధిత అధికారులతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడి అవసరమైన రెండు లక్షల రూపాయలను (2,00,000) గుండె ఆపరేషన్ కోసం మంజూరు చేయించడం జరిగింది.తమ బాధను అర్థం చేసుకొని ఆపరేషన్ కోసం LOC మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు , నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి గజ్జెల మల్లేశ్వరి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


