
దశాబ్దాల ప్రయాణం,నేటితో తుదిదశ
గత స్మృతులు తలుస్తూ,కన్నీటి పర్వంతమైన ఎమ్మెల్యే దంపతులు
పాడెమోసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు,వెంట కదిలిన కాంగ్రెస్ శ్రేణులు
పయనించే సూర్యుడు మార్చి 20 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి బోరింగ్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టేకులపల్లి తాజా,మాజీ ఎంపీపీ కోరం కనకయ్యకు వీరాభిమాని ఉండేటి ప్రసాద్, అంతిమయాత్రలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య కుటుంబ సభ్యులుపాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు.
గత ముప్పై ఏళ్లుగా కోరం కుటుంబ సభ్యులతో మృతునికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు.
నేడు టేకులపల్లి మండలం,సులానగర్ గ్రామంలో నిర్వహించిన మాజీ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ అంతిమయాత్రకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తరలిరాగా,నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య స్వయంగా పాడే మోసి నివాళులర్పించారు.
