పయనించే సూర్యుడు జనవరి 12 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
హసన్ పర్తి మండల పరిధిలోని జయగిరి గ్రామానికి చెందిన మైల గాని మల్లేశం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబానికి అండగా నిలిచిన తోటి డ్రైవర్లు, మరియు వివిధ కుల సంఘాల నుండి గ్రామస్తులు దాతలుగా అండగా నిలిచారు మృతుడు మైల గాని మల్లేశం వృత్తిరీత్యా లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు ఇతనికి భార్య మైల గాని శారద, ఇద్దరు కూతుర్లు పెద్దకూతురు మైల గాని ఆకాంక్ష, చిన్న కూతురు మైల గాని అక్షిత ఉన్నారు గ్రామస్తులు వారి కుటుంబానికి ఓదార్పునిచ్చి మల్లేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం దాతల రూపంలో వచ్చిన 33000 వేల రూపాయలను కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా అందజేశారు ఈ కార్యక్రమంలో చింత రమేష్, ఏలిమి రమేష్, ఏలిమి కుమారస్వామి, ఏలిమి అనిల్, కసర బోయిన సుభాష్, తోపేల సురేష్, ఒజ్జ కుమార్, దాతలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు