
ఆర్థిక సహాయాన్ని అందజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయికల్ శ్రీనివాస్
మానవతా విలువలకు నిదర్శనంగా రాయికల్ శ్రీనివాస్ సహాయం
( పయనించే సూర్యుడు ఆగస్టు 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగా రెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని రాయికల్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల యాదయ్య మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ , యాదయ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ, వారి ఆర్థిక సమస్యలను కొంత మేర తగ్గించే ఉద్దేశంతో శ్రీనివాస్ వ్యక్తిగతంగా రూ.5,000/- ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రోళ్ల యాదయ్య, కృష్ణయ్య, చాకలి యాదయ్య, సంద వేణు, సత్యం, శ్రీకాంత్, బాలు, సందీప్, సతీష్, శ్రీకాంత్, రాఘవేందర్, చిన్నయ్య, సురేష్, వంశీ, బన్నీ మరియు తదితరులు పాల్గొన్నారు.