
ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి. నరేష్ *
పయనించే సూర్యుడు జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం లో విస్తృత స్థాయి సమావేశంలో జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ ఆదివాసులకు దగ డీఎస్సీ గా మారిందని. కూటమి ప్రభుత్వం తాము అధికారంలో వస్తే ఆదివాసి యువతకి జీవో నెంబర్ 3 తీసుకువచ్చి 100% ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం నారా చంద్రబాబునాయుడు గారు మాట (హామీ ) ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాని సంగతి పక్కన పెట్టారని తీవ్రంగా విమర్శించారు.ఆదివాసి ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఆదివాసులకే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే ఐదవ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో క్లాజ్ 1,2, ప్రకారం గవర్నర్ టీఏసి అనుమతి తీసుకొని రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని ఆదివాసులకు ప్రత్యేక భాష సంస్కృతి బొట్టు కట్టుబాట్లు ఉన్నాయి ఆదివాసి ప్రాంతాల్లో భాష రాని మైదాన ప్రాంత ఉపాధ్యాయులను ఏజెన్సీలో నియమించడం వలన ఆర్టికల్ 23 39 లను ఉల్లంఘించినట్లు అవుతుంది ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలను స్థానిక ఆదివాసి అభ్యర్థులతోనే నూటికి నూరు శాతం ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ పునరుదించాలని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ. మా ఏజెన్సీలో మా ఆదివాసి ప్రాంతాల్లో ఒకపక్క పోలవరం పేరుతో సమాధి అవుతున్న మా ఆదివాసులు ఒక ప్రక్క ఖనిజాల పేరుతో స్థిరానివాసాలు లేకుండా పోతున్నాయి. 1/70 చట్టం పరిధిలో నోటిపై ఏజెన్సీ ప్రాంతాలలో విద్య ఉపాధి ఉద్యోగులను నూటికి నూరు శాతం స్థానిక ఆదివాసి నిరుద్యోగులతో భర్తీ చేయవలసి ఉన్నది ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం గా అగ్రకులవర్ణాల వాళ్లకి ఏజెన్సీ ప్రాంతంలో కల్పించడం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నది, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతాలకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి ఆ హక్కులను కాపాడవలసిన బాధ్యత కూడా ఐటీడీఏలకు ఉన్నది కానీ దానికి వీరుద్దంగా జరుగుతున్నవి, అని ఆయన ఈ పత్రిక సమావేశంలో ఆయన వివరించడం జరిగింది కార్యక్రమంలో డివిజన్ చేసి చైర్మన్ జల్లి నరేష్, సీసం సురేష్, ఆదివాసి ఉద్యోగుల జేఏసీ నాయకులు బొడ్డు బలరాం, పొడియం లక్ష్మణ్, ముచ్చిక బాలకృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.