
బాధితుడు కొమ్ముగారి రామకృష్ణకి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆర్థిక సహాయం అందజేత
( పయనించే సూర్యుడు మార్చి 21 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ )
షాద్ నగర్ : ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన కొమ్ముగారి రామకృష్ణ కు చెందిన మేకలు ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం కుక్కలు దాడి చేసి చంపి వేయడం జరిగింది. ఈ దాడిలో 11 మేకలు చనిపోవడం ఇట్టి విషయంపై స్థానిక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు సమస్యను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు వెంటనే బాధిత కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందించారు మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అతనికి మేకలు తెచ్చుకోవడానికి సుమారు మూడు లక్షలు రూపాయలు వచ్చే విధంగా మరింత సాయం అందే విధంగా కృషి చేద్దామని హామీ ఇచ్చారు అనంతరం బాధితుడికి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి రాజు కార్యదర్శివర్గ సభ్యులు శ్రీను నాయక్ ఈశ్వర్ మరియు బూరుగుల గ్రామ మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి. మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ నాయకులు తిరుపతి రెడ్డి విశ్వం . దంగు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.