
8గంటల పని విధానాన్ని కాపాడుకుందాం
సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు శ్రీను నాయక్
( పయనించే సూర్యుడు మే 01 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ ఫరూక్నగర్ మండలం చింతగూడెం గ్రామంలో మేడే సందర్భంగా జెండావిష్కరణ చేసిన సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు శ్రీను నాయక్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగ శ్రీను నాయక్ మాట్లాడుతూ అమెరికా దేశం చికాగో నగరంలో 1886 సంవత్సరం మే 1న పని గంటల కోసం కార్మికులు చేపట్టిన సమ్మె సందర్భంగా ఆనాటి పాలకుల ఆదేశాలతో చికాగో నగరంలోని హే మార్కెట్ లో కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు కార్మికులు మరణించారని అనేకమంది కార్మికులు రక్తం చిందించారని ఫలితంగా మరణించిన కార్మికులను స్మరిస్తూ 1989లో రెండవ ఇంటర్నేషనల్ సమావేశంలో అంతర్జాతీయంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి మెరుగైన పని పరిస్థితుల కొరకు పోరాడే దినంగా మేడేను జరపాలని పిలుపునిచ్చారని ఆనాటి నుండి మేడేను కార్మిక వర్గం దీక్షా దినంగా పాటిస్తూ ఉన్నారని తెలిపారు.నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని వీటి ఫలితంగా 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చారని కనీస వేతనాలు కూడా లేకుండా చేశారని తెలిపారు. మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మే 20న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు అదేవిధంగా గ్రామంలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ శ్రేణులు పనిచేయాలని మరియు ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలను పేదలకు 75 గజాలు పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహించి గతంలో పట్టాలు పంపిణీ చేసిందన్నారు. వాటిని స్థానిక ఎమ్మెల్యే అధికారులు సర్వే నిర్వహించి పనులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు ఈకార్యక్రమంలో, సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శిలు ఆవుల వెంకటేష్.శంకరయ్య శంకరమ్మ. శ్రీను. సరస్వతి. యాదమ్మ. బాలమ్మ. సరస్వతి. కిష్టయ్య. మహేష్. భరత్.శ్రీశైలం. తరుణ్. శ్రీకాంత్. పద్మమ్మ. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
