
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?..
(A.I.S.B) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్…
రుద్రూర్, సెప్టెంబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి ) : మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులకు వారి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని (A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ లో చేర్చి వీరిని గుర్తించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం నెల నెల లక్షల్లో జీతాలు సమయానికి ఇస్తున్నారని ఆయన అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తే తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలల్లో పనిచేస్తున్న ఎక్కువ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి వెంటనే మైనార్టీ గురుకులాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయాలనీ ఆయన కోరారు. అలాగే (ఈఎస్ఐ), (ఈపిఎఫ్) లు వెంటనే ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత రెండు నెలల నుంచి జీతాలు విడుదల చేయలేరని కావున వెంటనే జీతాలను విడుదల చేయాలనీ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేని యెడల మా (A.I.S.B) విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మైనార్టీ గురుకలాల నాన్ టీచింగ్ ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడించగలమని ఆయన తెలిపారు.